Loading...
Nepal-India Relations: నేపాల్ యువతకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్.. ఐఐటీ క్యాంపస్.. స్టార్టప్ ఇంక్యుబేటర్,ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు
ఐఐటీ క్యాంపస్.. స్టార్టప్ ఇంక్యుబేటర్,ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు

Nepal-India Relations: నేపాల్ యువతకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్.. ఐఐటీ క్యాంపస్.. స్టార్టప్ ఇంక్యుబేటర్,ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌, నేపాల్ మధ్య విద్యా, సాంకేతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. నేపాల్ యువతకు ఉన్నత విద్య,నైపుణ్యాభివృద్ధి,ఆవిష్కరణల రంగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు భారత్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా నేపాల్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అలాగే అక్కడ స్టార్టప్ ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్ హబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నేపాల్ పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని బలేంద్ర షాతో సోమవారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల ప్రతినిధి బృందాల స్థాయి చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నేపాల్ యువతలో అపారమైన ప్రతిభ, సామర్థ్యం, కొత్త ఆలోచనలు ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.

వివరాలు 

నేపాల్ యువతకు ప్రపంచస్థాయి విద్య, సాంకేతిక అవకాశాలు

వారి ఆశయాలు, కలలను సాకారం చేసుకునేందుకు భారత్‌ తన వంతు సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

నేపాల్ యువతకు ప్రపంచస్థాయి విద్య, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

స్టార్టప్ ఇంక్యుబేటర్ ద్వారా కొత్త వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని, ఇన్నోవేషన్ హబ్ ద్వారా పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

వివరాలు 

భారతదేశంలో నేపాలీ విద్యార్థులకు మరిన్ని స్కాలర్‌షిప్‌లు

నేపాల్‌లో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు, భారతదేశంలో చదువుకోవాలనుకునే నేపాలీ విద్యార్థులకు కూడా మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

ముఖ్యంగా న్యాయశాస్త్రం (లా), సాంకేతిక విద్యా రంగాల్లో స్కాలర్‌షిప్‌ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు.

దీనివల్ల నేపాల్ విద్యార్థులు భారతీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

ఈ ఏడాది ప్రారంభంలో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బలేంద్ర షా.. తొలిసారిగా భారత్‌లో ద్వైపాక్షిక పర్యటనకు వచ్చారు.

ఈ సందర్భంగా ఇరుదేశాలు సోమవారం సంయుక్త దార్శనిక పత్రాన్ని (జాయింట్ విజన్ డాక్యుమెంట్) విడుదల చేశాయి.

ADVERTISEMENT

వివరాలు 

భారతదేశంలో నేపాలీ విద్యార్థులకు మరిన్ని స్కాలర్‌షిప్‌లు

భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న 'వికసిత్ భారత్‌', నేపాల్‌ నిర్దేశించుకున్న 'సమున్నత నేపాల్‌' ఆశయాలను ఉమ్మడిగా సాధించేందుకు ఈ పత్రం మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

రెండు దేశాల అభివృద్ధి, పరస్పర సహకారానికి ఇది కీలకమైన అడుగుగా అభివర్ణించారు.

ADVERTISEMENT

వివరాలు 

బలేంద్ర షా తొలి ద్వైపాక్షిక పర్యటనకు స్వాగతం

నేపాల్ ప్రధాని బలేంద్ర షా నాయకత్వంపై నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.

నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి ద్వైపాక్షిక పర్యటనకు భారత్‌ను ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.

కొన్ని నెలల క్రితం ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన సమయంలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బలేంద్ర షా గుర్తింపు పొందారని మోదీ గుర్తుచేశారు.

అప్పుడే ఆయన ఆలోచనలు, భవిష్యత్తుపై ఉన్న దార్శనికత స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు.

వివరాలు 

బలేంద్ర షా తొలి ద్వైపాక్షిక పర్యటనకు స్వాగతం

తాజాగా జరిగిన సమావేశాల్లోనూ నేపాల్ భవిష్యత్తు, భారత్‌-నేపాల్ సంబంధాల అభివృద్ధిపై షాకు ఉన్న స్పష్టమైన ఆలోచనలు, నిబద్ధత తనకు అర్థమయ్యాయని మోదీ చెప్పారు.

ఈ ఏడాది నేపాల్ ప్రజలు బలేంద్ర షాకు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఆ దేశ యువతలో ఉన్న కొత్త ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన అన్నారు.

యువత ఆకాంక్షలకు అనుగుణంగా నేపాల్ అభివృద్ధి చెందేందుకు భారత్‌ సహకారం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT