LOADING...
PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం 
ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం

PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2025
09:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి మారిషస్‌ (Mauritius) అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది. మారిషస్‌ అత్యున్నత పురస్కారమైన "ది గ్రాండ్‌ కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ది ఇండియన్‌ ఓషన్‌" ను ఆ దేశ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం (Navinchandra Ramgoolam) ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం మారిషస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాం, ఆయన సతీమణి వీణా రామ్‌గులాంలకు 'ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (OCI)' కార్డులు అందజేశారు.

వివరాలు 

మారిషస్‌లోని భారతీయులతో మోదీ

పర్యటనలో భాగంగా మారిషస్‌లోని భారతీయులతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పదేళ్ల క్రితం ఇదే రోజున నేను మారిషస్‌కు వచ్చాను. అప్పటికీ హోలీ పండుగకు పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి కూడా హోలీ రంగులను నాతో పాటు భారత్‌కు తీసుకెళ్తా. ఇక్కడ రాగానే నాకు నా సొంత ఊరిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. మనమంతా ఒకే కుటుంబం" అని పేర్కొన్నారు. తనను అత్యున్నత పురస్కారంతో సత్కరించిన మారిషస్‌ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.