PM Modi Fire-on Sam Pitroda comments: వారసత్వ సంపద పంపిణీ సిగ్గుచేటు: శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రధాని మోదీ
సంపన్నులు (Elites) చనిపోయిన తర్వాత వారి సంపద (wealth)ను పేదవారికి పంపిణీ చేయాలన్నకాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా (Sam Pitroda) వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మండిపడ్డారు . వారసత్వంగా పనులు కట్టిన సంపన్నులు చనిపోయిన తర్వాత వారి సంపదను కాంగ్రెస్ (Congress) నేతలు లూటీ చేయాలనుకుంటున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో ఛత్తీస్ గఢ్ (Chathisgarh) లోని సర్గుజా (Surguja) లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రజలు కష్టపడి సంపాదించిన సంపదను తమ పిల్లలకు అందనివ్వకుండా ప్రజలపై అధిక పన్నులు విధించి కాంగ్రెస్ తన ఖజానాను నింపుకోవాలని చూస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి మీ సంపదను లాక్కుంటుంది: పీఎం మోదీ
రాజ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సలహాదారు శ్యామ్ పిట్రోడా మధ్యతరగతి ప్రజలపై అధిక పన్నులు విధించాలని గతంలో చెప్పారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తు చేశారు. వారసత్వపు పన్ను విధిస్తామని తల్లిదండ్రుల నుంచి పొందే వారసత్వపు సంపదపై కూడా పన్నులు విధిస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆ పార్టీ తీరును ప్రజలంతా ఆలోచించాలని మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ కష్టార్జితంతో సంపాదించిన సంపదను మీ పిల్లలకు దక్కనివ్వకుండా కాంగ్రెస్ లాక్కుంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. వారసత్వ సంపద పై పన్ను విధించాలనుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీని మోదీ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర ఉద్దేశాలనే శ్యామ్ పిట్రోడా వెల్లడించారని మోదీ వ్యాఖ్యానించారు.