LOADING...
PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది. ఈ రోజు (శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలోని తిరువనంతపురం నుంచి మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి ఆయన మూడు అమృత్ భారత్ రైళ్లు, మొత్తం నాలుగు కొత్త రైల్ సర్వీసులు ప్రారంభించారు. ఇందులో తెలంగాణకు కేటాయించిన చర్లపల్లి-తిరువనంతపురం సూపర్‌ఫాస్ట్ రైలు కూడా ఉంది.

వివరాలు 

తిరువనంతపురం సెంట్రల్ నుంచి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు

ప్రధాని మోదీ జెండా ఊపిన వెంటనే తిరువనంతపురం సెంట్రల్ నుంచి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు తిరువనంతపురం సెంట్రల్ నుండి తాంబరం, నాగర్‌కోయిల్ (తమిళనాడు) జంక్షన్ నుంచి మంగళూరు (కర్ణాటక) జంక్షన్ వరకు నడుస్తాయి. అదే సమయంలో, తిరువనంతపురం నార్త్ నుండి చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 10:45 గంటలకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు. ప్రస్తుతం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రైళ్ల ప్రారంభోత్సవం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

వివరాలు 

చర్లపల్లి (హైదరాబాద్) - తిరువనంతపురం రైలు వివరాలు

చర్లపల్లి-తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారంలో ఒక్కసారి మాత్రమే సర్వీసు అందిస్తుంది. రైలు నంబర్ 17041: ప్రతి మంగళవారం ఉదయం 7:15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు తిరువనంతపురం చేరుతుంది. తిరుగు రైలు నంబర్ 17042: ప్రతి బుధవారం సాయంత్రం 5:30 గంటలకు తిరువనంతపురం నుంచి బయలుదేరి, గురువారం రాత్రి 11:30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు: నాగర్‌కోయిల్ - మంగళూరు తిరువనంతపురం - తాంబరం తిరువనంతపురం - చర్లపల్లి ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ కొత్త రైల్వే సేవలు ప్రాంతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించిన మోదీ 

Advertisement