Page Loader
G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ  
నేటి నుంచి 2 రోజుల పాటు ప్రపంచ దేశాధినేతల చర్చలు

G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

జీ20 సదస్సు శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. శిఖరాగ్ర సమావేశానికి తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న భారత్ రాజధాని దిల్లీ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రపంచ దేశాధినేతల రాకతో మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతలతో రెండు రోజుల జరగనున్న జీ20 సదస్సు కోసం ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపాన్నిప్రత్యేకంగా తీర్చిద్దిదారు. భారత్‌ మండపం వద్ద స్వయంగా ప్రధాని మోదీ దేశాధినేతలకు స్వాగతం పలికారు. ఈ అంశాలపై దృష్టి.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో దిగజారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థల పతనాలకు పరిష్కారం సమ్మిళిత వృద్ధి మానవాళి కేంద్రంగా అభివృద్ధి పరస్పర సహకారం వాతావారణ మార్పులు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్' నినాదంతో సదస్సు నిర్వహిస్తున్న భారతదేశాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ ప్రశంసించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ20 సమ్మిట్ ప్రారంభం

DETAILS

జీ20 వేదిక వద్దకు వచ్చిన దేశాధినేతలు వీరే.. 

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఐరాస నుంచి ఆంటోనియో గుటెరస్‌, బంగ్లాదేశ్‌ ప్రధాని హసీనా జీ20 వేదిక వద్దకు చేరుకున్నారు. ఐఎంఎఫ్‌ అధినేత క్రిస్టాలినా జార్జీవా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, ఇటలీ ప్రధాని మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో, చైనా ప్రధాని లీ కియాంగ్‌, సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా భారత్ మండపం వద్దకు వెళ్లారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని , యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్‌ బిన్‌, కెనడా ప్రధాని ట్రూడో, టర్కీ, ఇండోనేషియా నేతలు సదస్సుకు హాజరయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్వాగతం పలుకుతున్న మోదీ

DETAILS

సదస్సులో కీలక అంశాలు ప్రవేశపెట్టనున్న భారత్

సదస్సు ముఖ్యాంశాలు ఆఫ్రికన్‌ యూనియన్‌కు G-20లో సభ్యత్వం అంతర్జాతీయ రుణ వితరణ పునర్వ్యవస్థీకరణ అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ వితరణ జీ-20 అధ్యక్ష పాత్రలో భారత్‌ ప్రతిపాదనలు సమ్మిళిత వృద్ధి డిజిటల్‌ ఆవిష్కరణ క్రిప్టో కరెన్సీపై నియంత్రణ వ్యవస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాతావరణ మార్పులు అందరికీ సమాన ఆరోగ్య ఆవకాశాలు

DETAILS

ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 85 శాతం వాటా జీ-20 దేశాలదే

భారత్‌ ఆహ్వానించిన జీ-20 యేతర దేశాలు : బంగ్లాదేశ్‌, ఈజిప్టు, మారిషస్‌, యూఏఈ, స్పెయిన్‌, సింగపూర్‌, ఒమన్‌, నైజీరియా, నెదర్లాండ్స్‌ ప్రపంచంపై జీ-20 ప్రభావం : ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా G-20 దేశాలదే ప్రపంచ జనాభాలో 66 శాతం వాటా G-20 దేశాలదే ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా G-20 దేశాలదే. జీ- 20 దేశాలు : భారత్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్‌, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్‌, అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌.