Page Loader
PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ
యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు. లక్నోలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 7-8 సంవత్సరాల క్రితం,ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎక్కడ చూసినా నేరాలు, అల్లర్లు కర్ఫ్యూలే ఉండేవన్నారు. ఇప్పుడు ఉన్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తునందుకు సంతోషంగా ఉందన్నారు..?, భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని మోడీ చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అభివృధి పనులు ప్రారంభించిన ప్రధాని 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని