Page Loader
భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు
దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 25, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరస రాజకీయ పర్యటనలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ను మరోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు భోపాల్‌లోని జంబోరిలో జన్ ఆశీర్వాద్ యాత్ర సభలో ప్రసంగించిన ప్రధాని, మోదీ మూడ్, శ్రమ వేరని, మోదీ లక్ష్యం కూడా వేరేనన్నారు. తమకు దేశం, ప్రజల కంటే మించినది ఏదీ లేదన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ చేరుకోనున్నారు.అనంతరం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌కు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. 3 గంటలకు నగర శివార్లలోని మైదానానికి చేరుకుని పరివర్తన్ సంకల్ప్ మహాసభలోనూ ప్రసంగం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ కారణంగానే 45 రోజుల వ్యవధిలోనే మోదీ మూడోసారి ఎంపీలో పర్యటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ మూడ్ వేరు, ఆయన శ్రమ వేరు: నరేంద్ర మోదీ