PM Modi: మారిషస్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ప్రత్యేక కానుక.. కుంభమేళా పవిత్ర జలం గిఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్‌లో పర్యటిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా, మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు ప్రత్యేకమైన కానుక అందజేశారు.
మహా కుంభమేళా నుండి తీసుకెళ్లిన పవిత్ర గంగాజలాన్ని ఆయనకు బహుమతిగా అందించారు.
అదనంగా, పలు ఇతర బహుమతులను కూడా అందజేశారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
వివరాలు
అమ్మ పేరిట మొక్క నాటిన మోదీ
ఇందుకు ముందు, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్‌గోలంతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
అనంతరం, ఇద్దరూ కలసి ఆ దేశ జాతిపిత సీవో సాగర్ రామ్‌గోలం పేరుతో ఏర్పాటు చేసిన బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు.
ఈ సందర్బంగా, ఇరు దేశాల ప్రధానులు కలిసి మొక్కలు నాటారు. ఈ అద్భుతమైన క్షణాన్ని భారత ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
అక్కడ ఆయన ఇలా పేర్కొన్నారు - "ఏక్ పేడ్ మా కే నామ్" (అమ్మ పేరిట మొక్క) కార్యక్రమంలో నా స్నేహితుడు నవీన్ కూడా పాలుపంచుకోవడం చాలా ఆనందదాయకం. ప్రకృతి, మాతృత్వం, స్థిరత్వానికి గుర్తుగా ఈ మొక్క నిలుస్తుంది'' అని మోదీ అన్నారు.
వివరాలు
ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహించిన తొలి "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వన మహోత్సవాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
భూమాతను రక్షించడానికి, ప్రతి ఒక్కరూ తల్లి పేరిట ఒక మొక్కను నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఈ ఉదయం మారిషస్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు.
రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొననున్నారు.