Page Loader
Pm Modi To Revanth : సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు.. తెలంగాణకు భరోసా 
సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు

Pm Modi To Revanth : సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు.. తెలంగాణకు భరోసా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 07, 2023
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తరఫున మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానంటూ మోదీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియలో గురువారం రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా,మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. వీరితో పాటు మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీతక్క,కొండా సురేఖ,తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు మంత్రివర్గ సహచరులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు