Page Loader
PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు
యువతకు, మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట

PM Narendra Modi: యువతకు,మధ్య తరగతి ప్రజలకు పెద్దపీట..కేంద్ర బడ్జెట్‌పై నరేంద్ర మోదీ ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2024
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్ సభలో ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు గుప్పించారు. ఈ బడ్జెట్ భారతదేశాన్ని సుసంపన్నం చేసి,యువత, మధ్య తరగతి ప్రజలకు కొత్త భరోసానిస్తుందని వ్యాఖ్యనించారు. ఈ బడ్జెట్ దేశాన్ని సుభిక్షం వైపు తీసుకెళ్తుందని, సమాజంలోని అన్ని వర్గాల వారికి భరోసానిస్తుందన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.

details

చిన్న పరిశ్రమలకు ప్రోత్సహాకాలు

గిరిజనులు, దళితులు, వెనుకబడిన ప్రజలకు సాధికారత కల్పించేందుకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందించామన్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి ఈ బడ్జెట్ తోడ్పనుందన్నారు. ఈ బడ్జెట్‌తో వ్యాపారులు, చిన్న పరిశ్రమలు కొత్త పురోగమన బాట పడతాయని మోదీ అన్నారు. ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. బడ్జెట్‌లో ఉత్పత్తితో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు. ఇది ఆర్థికాభివృద్ధికి సాయపడనుంది.

Details

ముద్రా రుణాలు రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపు

దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలో నిరుద్యోగులకు అవకాశం కల్పించి, వారికి కొత్త అవకాశాల తలుపులు ఇవ్వనున్నారు. కొత్త ఉద్యోగులకు తొలి జీతం తమ ప్రభుత్వమే ఇస్తుందని, కోటి మందికి ఇంటర్న్‌షిప్‌ అవకాశం, ఇంటర్న్‌షిప్‌ ద్వారా గ్రామీణులకు పెద్ద కంపెనీల్లో పనిచేసే వెసులుబాటు ఉండనుంది. గ్రామం నుంచి పట్టణాల వరకూ అందర్నీ వ్యాపారవేత్తలగా తీర్చిదిద్ది, ముద్రా రుణాల పరిధిని రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు పెంచామన్నారు.

details

కేంద్ర బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లు

భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చి, ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించేందుకు కొత్త పథకం తీసుకొస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మధ్య తరగతికి భరోసానిచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం విశేషం.