PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని, అందుకే ఇది ఎన్నికల సభల కాదన్నారు.
దేశవ్యాప్తంగా అభివృద్ధి ఉత్సవాలు జురుగుతున్నాయని, గత 15రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు.
కుటుంబ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని, బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
కుటుంబ పార్టీల్లో రెండే అంశాలు ఉంటాయని, ఒకటి దోచుకోవడం, మరొకటి అబద్ధాలు చెప్పడమన్నారు.
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎం చేస్తోందని ప్రశ్నించారు.
మోదీ
ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ కృషి
ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు తాము పనిచేస్తున్నామన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకుపైగా గెలుపే తమ లక్ష్యమన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ పని చేస్తుందని మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణ రైతుల కోసం తమ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 7 మెగాటైక్స్‌టైల్స్ పార్కులను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, అందులో ఒకటి తెలంగాణలో ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు.
తెలంగాణకు ఇప్పటికే సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబర్ వర్సిటీని ప్రకటించచామని, అలాగే, హైదరాబాద్‌లో రాంజీ గోండ్ పేరుతో మ్యూజియంను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాట్లాడుతున్న ప్రధాని మోదీ
బిజెపికి ఓటు వెయ్యాలి.. 400 సీట్లు దాటాలి. #ModiMataAbhivrudiBata pic.twitter.com/Em1zoPZksw
— BJP Telangana (@BJP4Telangana) March 4, 2024