LOADING...
PM Modi: ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్‌ పోస్టుపై స్పందించిన మోదీ 
ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్‌ పోస్టుపై స్పందించిన మోదీ

PM Modi: ట్రంప్‌తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్‌ పోస్టుపై స్పందించిన మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, అమెరికా మధ్య టారిఫ్ వివాదాలు కొనసాగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌ లో పోస్టు ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో,ప్రధాని మోదీ కూడా స్పందించి,తాను డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ట్రంప్ ఇప్పటికే తన పరిపాలన విభాగం భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చలు జరుపుతుందని ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న వాణిజ్య అడ్డంకులను తొలగించి,పరస్పర ప్రయోజనాలు సాధించాలని పేర్కొన్నారు. మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే ఈ సంభాషణ జరిగే అవకాశం ఉందని,ఇది రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

భారతదేశం,అమెరికా మధ్య ఉన్నది ప్రత్యేక బంధం

రష్యా నుండి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించారు.దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొంత మేర ఒత్తిడికి లోనయ్యాయి. అయితే ఇటీవల మోదీ షాంఘై సహకార సంస్థ శిఖర సదస్సుకు హాజరైనప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్,రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. దీనిపై కూడా ట్రంప్‌ తన అక్కసు వెళ్లగక్కారు.అయితే, ఈవిషయంపై ఇటీవల ఆయన స్వరం మారింది భారతదేశం,అమెరికా మధ్య ఉన్నది ప్రత్యేక బంధం అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు. ఈ పోస్టుపై కూడా నాడు మోదీ స్పందించారు. ఇరుదేశాల సంబంధాలపై ట్రంప్‌ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.