LOADING...
PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు
ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు

PM Modi: ప్రధాని మోడీ విమానంలో సాంకేతిక లోపం..టేకాఫ్ కాలేదు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 15, 2024
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. జార్ఖండ్ లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు ఆయన బయలుదేరారు. అయితే, విమానంలో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్‌ అవ్వలేదు. ఈ కారణంగా ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగొచ్చేందుకు ఆలస్యమైంది. సాంకేతిక బృందం ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఉదయం జార్ఖండ్ లో రెండు ప్రాంతాల్లో ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ, తరువాత దేవ్‌గఢ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో ఆయన ప్రయాణం ఆలస్యమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానాన్ని డియోఘర్ విమానాశ్రయంలో తాత్కాలికంగా నిలిపివేశారు 

వివరాలు 

నవంబరు 23న ఎన్నికల ఫలితాలు

అలాగే, ఈ రోజే జార్ఖండ్ లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ కూడా గంటల తరబడి ఆగిపోయింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) నుంచి అనుమతి అందకపోవడంతో ఆయన హెలికాప్టర్‌ గోడ్డాలో ఆగిపోయింది. దీనికి కేవలం బీజేపీనే కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఝార్ఖండ్‌లో ఈ నెల 13న మొదటి విడత పోలింగ్‌ జరిగింది, కాగా నవంబరు 20న మహారాష్ట్రతో కలిసి రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.