LOADING...
PM Modi: రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ
రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ

PM Modi: రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్తవ్యపథ్‌పై జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బహురంగుల సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి రంగురంగుల సఫా ధరించే సంప్రదాయాన్ని ఈసారి కూడా మోదీ కొనసాగించారు. ఎరుపు-పసుపు రంగుల్లో మెరిసిన ఈ సఫాపై లెహరియా తరహా అలల నమూనాలు, బంగారు జరీ పనితో చేసిన అలంకరణ చూపరులను ఆకట్టుకుంది. పండుగ వాతావరణం, శుభప్రదతకు ప్రతీకగా భావించే డిజైన్‌ను ఈ ఏడాది ఎంపిక చేశారు.

వివరాలు 

నెమలి ఆకృతితో ఉన్న బహురంగుల బంధనీ సఫా

నేవీ-తెలుపు రంగుల కుర్తా-పైజామాతో పాటు లైట్ బ్లూ నెహ్రూ జాకెట్‌తో మోదీ ఈ సఫాను జత చేశారు. సంప్రదాయ విలువలు, అధికారిక హంగు రెండింటినీ మేళవించిన ఆయన ప్రత్యేక శైలిని ఇది ప్రతిబింబించింది. 2015లో ప్రధాని హోదాలో తొలి గణతంత్ర దినోత్సవానికి నెమలి ఆకృతితో ఉన్న బహురంగుల బంధనీ సఫాను ధరించారు. 2022లో మాత్రమే సఫా వదిలి, బ్రహ్మ కమలం పువ్వు చిహ్నం ఉన్న ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని ధరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమర సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను గౌరవించిన ప్రధాని మోదీ

Advertisement

వివరాలు 

భారతదేశ వైవిధ్యాన్ని,సైనిక శక్తిని ప్రదర్శించే గణతంత్ర దినోత్సవ కవాతు

ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ పరేడ్ సుమారు 90 నిమిషాల పాటు సాగనుంది. ఈ పరేడ్‌లో భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి ప్రయాణం, సైనిక శక్తి స్పష్టంగా ప్రతిబింబించాయి. 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన ప్రధాన ఆయుధ వ్యవస్థల మాక్‌అప్స్‌ను ప్రదర్శించారు. సుమారు 6 వేల మంది రక్షణ సిబ్బంది పాల్గొనగా, యూనివర్సల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ (URLS) 'సూర్యాస్త్ర', శక్తిబాన్ రెజిమెంట్ వంటి కొత్త ఆర్మీ ప్లాట్‌ఫాంలు కూడా ప్రదర్శనలో భాగమయ్యాయి. అలాగే 'వందే మాతరం' గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేకంగా నివాళులు అర్పించారు.

Advertisement