PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నిర్మల్‌లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బీఆఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై మోదీ విమర్శలు గుప్పించారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి తెలంగాణకు అవసమా? సచివాలయానికి రాని సీఎం అవసరమా? అని మోదీ ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, ప్రజల కోసం కాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. పేదలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు సాగనంపాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ సర్కార్ అంటేనే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వమన్నారు.
దుబ్బాక, హుజురాబాద్‌లో చూసింది ట్రైలర్ మాత్రమే: మోదీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒకటే అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌కు జిరాక్స్ కాపీ బీఆర్ఎస్ అని మోదీ పునరుద్ఘాటించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ది నిజాం పాలన, కాంగ్రెస్ సుల్తాన్ వైఖరిని తిరస్కరించేందుకు ప్రజలకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం తనకు ఉందన్నారు. గజ్వేల్‌లో ఈటల రాజేందర్‌కు భయపడి కేసీఆర్ మరోచోట పోటీ చేస్తున్నారని మోదీ అన్నారు. దుబ్బాక, హుజురాబాద్‌లో ట్రైలర్ మాత్రమే చూశారని, ఈ ఎన్నికల్లో కేసీఆర్ సినిమా చూస్తారన్నారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ విస్మరించిందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.