
PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.
ఆదివారం బొప్పూడిలో ఏర్పాటు చేసిన ఎన్డీఏ( టీడీపీ-జనసేన-బీజేపీ) ప్రజాగళం బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తొలుత 'నా ఆంధ్రా కుటుంబ సభ్యులకు నమస్కారాలు' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ 400పైగా సీట్లను సాధిస్తుందన్నారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే.. వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ సైతం సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేసారు.
మోదీ
వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలి: మోదీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చాలా కాలం చేసిన కృషిని గుర్తించాలని మోదీ పిలుపునిచ్చారు.
ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఆవాస్ యోజన కింద దాదాపు పది లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు.
జలజీవన్ మిషన్ కింద తమ ప్రభుత్వం కోటి ఇళ్లకు తాగునీరును అందించినట్లు పేర్కొన్నారు.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలోని మంత్రులు అవినీతిలో పోటీపడుతున్నారు.
వైసీపీ పాలనలో ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఏపీతో పాటు దేశ అభివృద్ధిని కాంక్షించిన వారు ఎన్డీఏకు ఓటేయాలన్నారు.