Page Loader
PM Modi-Elon Musk: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కి భారత ప్రధాని మోదీ ఫోన్‌
టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కి భారత ప్రధాని మోదీ ఫోన్‌

PM Modi-Elon Musk: టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కి భారత ప్రధాని మోదీ ఫోన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌,అమెరికా మధ్య టారిఫ్‌ల (ఆంక్షల) అంశంపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పరిపాలనలో డోజ్ విభాగం అధిపతిగా ఉన్నటువంటి, ప్రస్తుత టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్‌ ద్వారా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌' (మాజీ ట్విట్టర్‌)లో తెలియజేశారు.

వివరాలు 

ఎలాన్ మస్క్‌తో అనేక అంశాలపై చర్చించాను: మోదీ 

'ఎలాన్ మస్క్‌తో అనేక అంశాలపై చర్చించాను. ఈ సంవత్సర ప్రారంభంలో వాషింగ్టన్‌లో జరిగిన మా సమావేశంలో చర్చించిన కొన్ని అంశాలను మళ్లీ ప్రస్తావించాం. సాంకేతిక రంగం, ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై గణనీయమైన చర్చ జరిగింది. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు భారత్‌ పూర్తి కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది'' అని మోదీ వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ చేసిన ట్వీట్