PM Modi: ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.. 11న ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.ఈ నెల 11, 12 తేదీల్లో ఆయన ఫ్రాన్స్‌ను సందర్శించనున్నారు.
ఫిబ్రవరి 11న పారిస్‌లో జరిగే ఏఐ సమ్మిట్‌కు మోదీ అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధాని పాల్గొననున్నారు.
అలాగే, ఫ్రెంచ్ కంపెనీల అగ్రశ్రేణి సీఈవోలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్చలు నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 12న మార్సెయిల్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.
భారత్‌ను ఏఐ సమ్మిట్‌కు అధ్యక్షత వహించేందుకు ఫ్రాన్స్ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
వివరాలు
ఆరోసారి ఫ్రాన్స్ పర్యటనకి మోదీ
వారం రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఇతర కీలక భాగస్వాములతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు, చైనా ఉప ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఫ్రాన్స్ పర్యటన మోదీకి ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 12న ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే వీవీఐపీ విందుకు కూడా ప్రధాని మోదీ హాజరవుతారు.