
PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాల్లో రూ.32,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్ములో పర్యటించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
జమ్ముకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన సుమారు 1,500 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన అపాయింట్‌మెంట్ లెటర్‌లను అందజేస్తారని, అలాగే 'విక్షిత్ భారత్, విక్షిత్ జమ్ము' ప్రచారంలో భాగంగా వివిధ కార్యక్రమాల లబ్ధిదారులతో సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం(PMO) ఒక ప్రకటన విడుదల చేసింది.
బనిహాల్-ఖరీ-సంబర్-సంగల్దాన్ ,ఇటీవల విద్యుద్దీకరించబడిన బారాముల్లా-శ్రీనగర్-బనిహాల్-సంగల్దాన్(185.66 కి.మీ)లను కలిపే 48 కిలోమీటర్ల లైన్‌తో సహా పలు రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. జమ్ము లోయలో మొదటి ఎలక్ట్రిక్ రైలును అలాగే సంగల్దాన్,బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సేవలను ప్రారంభిస్తారు.
Details
రూ. 13,375 కోట్ల విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
బనిహాల్-ఖరీ-సంబర్-సంగల్దాన్ స్ట్రెచ్‌ను ప్రారంభించడం గమనార్హం, ఎందుకంటే ఇది మార్గంలో బ్యాలస్ట్ లెస్ ట్రాక్ (BLT)ని ఉపయోగిస్తుంది, ప్రయాణీకులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
T-50 (12.77 కి.మీ) అనేది ఖరీ,సుంబెర్ మధ్య ఉన్న భారతదేశపు అతి పొడవైన రవాణా సొరంగం. రైల్వే ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంచుతాయి, పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి. ప్రాంతం ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయి.
దేశవ్యాప్తంగా విద్య, నైపుణ్యం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,అభివృద్ధి చేయడంలో భారీ ముందడుగు వేస్తూ, దాదాపు రూ. 13,375 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు.
Details
విజయపూర్ (సాంబా)లో AIIMS
ప్రాజెక్ట్‌లలో IIT భిలాయ్,IIT తిరుపతి, IIT జమ్మూ, IIITDM కాంచీపురం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (IIS), కాన్పూర్‌లో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల కోసం మార్గదర్శక నైపుణ్య శిక్షణా సంస్థ ,దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్), అగర్తలాలలో (త్రిపుర) కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ క్యాంపస్‌లు ఉన్నాయి.
జమ్ముకశ్మీర్ ప్రజలకు సమగ్రమైన, నాణ్యమైన ,సంపూర్ణమైన తృతీయ-సంరక్షణ ఆరోగ్య సేవలను అందించడానికి తన ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా, జమ్ములోని విజయపూర్ (సాంబా)లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)ని ప్రధాని ప్రారంభించనున్నారు. జాతీయ ప్రభుత్వం 'ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన' కింద నిర్మిస్తున్న ఈ ఇన్‌స్టిట్యూట్‌కు ఫిబ్రవరి 2019లో ఆయన శంకుస్థాపన చేశారు.
Details
జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన
రూ.1,660 కోట్ల వ్యయంతో 227 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 720 పడకలు, 125 సీట్లతో మెడికల్ కాలేజీ, 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ, 30 పడకలతో ఆయుష్ బ్లాక్, ఫ్యాకల్టీ, సిబ్బందికి నివాస వసతి, హాస్టల్ ఉన్నాయి. UG , PG విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాలతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది.
ఇదిలా ఇలా ఉంటే జమ్ము విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు.
Details
జమ్ముకశ్మీర్‌లో ప్రధాని రెండో సారి పర్యటన
అదేకాకుండా ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్ము - కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
జమ్ములో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
జమ్ము కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాడిన తర్వాత ప్రధాని రెండో సారి ఇక్కడ పర్యటిస్తున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు.