Page Loader
J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం 
జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం

J&K Assembly Poll:జమ్ముకశ్మీర్ లో ప్రారంభమైన పోలింగ్.. ప్రధాని మోదీ కీలక సందేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.నేడు కేంద్ర పాలిత ప్రాంతంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుండగా,ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల కమిషన్ కశ్మీర్‌లో 16,జమ్ములో 8 స్థానాల్లో మొత్తం 3,276 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 23 లక్షల 27వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎల్‌వోసీ సమీపంలోని పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు బలగాలు మోహరించబడినట్లు అధికారులు తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతతో ఓటింగ్ కొనసాగుతుండగా, 300 పారామిలిటరీ బలగాల కంపెనీలు స్థానిక పోలీసులతో కలిసి భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో ఉన్నారు.

వివరాలు 

ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య వేడుకను జరుపుకొండి: మోదీ 

ఇక జమ్ము కశ్మీర్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, కేంద్ర పాలిత ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య వేడుకను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటర్లు, మరియు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ప్రతి ఒక్కరి ఓటు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని చేసిన ట్వీట్