నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్ర, గోవా పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్రలో దాదాపు రూ. 7500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సాయిబాబా దేవాలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, 86 లక్షల మందికి పైగా రైతు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే 'నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజన' వంటి అనేక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనంతరం,గోవాలో తొలిసారిగా 37వ జాతీయ క్రీడలను ప్రధాని ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రధాని మోదీ షెడ్యూల్
మహారాష్ట్ర: 1:00 PM: అహ్మద్‌నగర్ జిల్లా షిర్డీకి చేరుకోవడం. 1:30 PM: శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రార్థన, దర్శనం. 2:00 PM: ఆలయం వద్ద దర్శన క్యూ కాంప్లెక్స్ ప్రారంభం. 2:30 PM: నీల్వాండే డ్యామ్ జల పూజ (జల ప్రతిష్ట). 3:15 PM: 7500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం
ప్రధాని మోదీ షెడ్యూల్
గోవా: 6:30 PM: గోవా చేరుకుంటారు. 6:45 PM: మార్గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవం. 7:30 PM: గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులను అడ్రెస్స్ చేస్తారు.