BJP : సంబరాలకు సిద్దమైన బీజేపీ కార్యకర్తలు . భారీగా ఏర్పాట్లు.
ఈ వార్తాకథనం ఏంటి
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
నేతల్లో పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠత పెరిగి పోయింది.
దేశ ప్రజల మొత్తం దృష్టి ఈ ఎన్నికల ఫలితాలమీదనే ఉంది.
దీంతో పాటు దేశ అధికార పీఠం ఎవరిది అనే ఉత్సుకత కూడా పెరిగింది
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి.
హ్యాట్రిక్ విజయాన్నిసాధిస్తుందని పేర్కొన్నాయి.
ఈ వార్తలు విన్న మోదీ అభిమానులు, బిజేపీ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ గెలుపుని పురష్కరించుకుని తమ సంతోషాన్నివ్యక్తం చేశారు. సంబరాల కోసం భారీ ఏర్పాట్లు చేశారు
దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది
details
మోదీ విజయం అన్న వార్తలు .పూలదండలు , బొకేలకు పెరిగిన డిమాండ్ .
నరేంద్రమోదీ విజయం అన్న వార్తలు విన్న అభిమానులు, కార్యకర్తలు వేడుకలను జరుపుకోవడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు.
గుజరాత్‌లో ప్రజల డిమాండ్ మేరకు పలు థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేశారు.
మరోవైపు పటాకులు కాల్చి పండుగ జరుపుకునేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు.
మరోవైపు కాసేపట్లో వెలువడనున్న ఫలితాలను పురష్కరించుకుని వేడుకల కోసం ముంబైలోని శ్రీ గణేష్ భండార్ స్వీట్ షాప్‌లో 10 వేల లడ్డూలను సిద్ధం చేశారు.
వీటికి తోడు పూల దండలు, బొకేలకు డిమాండ్ పెరిగింది.