Page Loader
PM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

PM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 15, 2024
07:59 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ప్రధాని మోదీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. త్యాగధనులు అందరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం పోరాడిన ప్రాణాలు ఆర్పించిన మహానీయులకు దేశం రుణపడి ఉంటుందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం