Page Loader
PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ
ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ

PM Modi: ఊబకాయంపై అవగాహన కల్పించేందుకు.. 10 మందిని నామినేట్‌ చేసిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదివారం నిర్వహించిన "మన్ కీ బాత్"కార్యక్రమంలో ప్రజలకు పిలుపునిచ్చారు. తాజగా, ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 10 మంది ప్రముఖులను ప్రధాని మోదీ (PM Modi) నామినేట్‌ చేశారు. వీరిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా,జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.

వివరాలు 

 వంటనూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన 

''నిన్నటి మన్‌ కీ బాత్‌లో చెప్పినట్లుగా,ఊబకాయంపై పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం,ఆహారంలో వంటనూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన పెంచేందుకు ఈ ప్రముఖులను నామినేట్‌ చేస్తున్నాను.ఈ ఉద్యమం మరింత విస్తరించేందుకు,వీరంతా మరో 10 మంది వ్యక్తులను నామినేట్ చేయాలని కోరుతున్నాను''అని మోదీ పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా, ఒమర్ అబ్దుల్లాతో పాటు, ప్రముఖ నటుడు దినేశ్‌లాల్ యాదవ్ అలియాస్ నిరాహువా, యువ షూటర్ మను బాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ప్రముఖ సినీ నటులు మోహన్‌లాల్, మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, అలాగే రాజ్యసభ ఎంపీ సుధా మూర్తిని ప్రధాని మోదీ నామినేట్‌ చేశారు.