National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు అందజేసిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూదిల్లీలోని భారత్ మండపంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డును అందజేశారు. బెస్ట్ స్టోరీ టెల్లర్,ది డిస్రఫ్టర్,సెలబ్రిటీ క్రియేటర్,గ్రీన్ ఛాంపియన్, బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్, మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ అగ్రి క్రియేటర్,కల్చరల్ అంబాసిడర్, బెస్ట్ ట్రావెల్ క్రియేటర్, స్వచ్ఛతా అంబాసిడర్,న్యూ ఇండియా ఛాంపియన్, టెక్ క్రియేటర్‌తో సహా 20 విభాగాలలో అవార్డులు అందించబడ్డాయి. హెరిటేజ్ ఫ్యాషన్, మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ (పురుష ,స్త్రీ), ఆహార విభాగంలో ఉత్తమ క్రియేటర్ , విద్యలో ఉత్తమ క్రియేటర్, అంతర్జాతీయ సృష్టికర్త అవార్డు.
అవార్డు గ్రహీతల పేర్లు.. అవార్డు కేటగిరి
కథ చెప్పడం, సామాజిక మార్పుల వాదించడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్‌తో సహా డొమైన్‌లలో శ్రేష్ఠత, ప్రభావాన్ని గుర్తించే ప్రయత్నమే ఈ అవార్డు అని ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో, మోటివేషనల్ స్పీకర్ జయ కిషోరి, అమెరికన్ యూట్యూబర్ డ్రూ హిక్స్,పలువురు సోషల్ మీడియా ప్రభావశీలులకు ప్రధాని మోదీ అవార్డులను అందజేశారు. అవార్డు గ్రహీతలు బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్- జయ కిషోరీ ఆహార కేటగిరీలో బెస్ట్ క్రియేటర్ అవార్డు - కబితా సింగ్ (కబితాస్ కిచెన్) ఉత్తమ అంతర్జాతీయ సృష్టికర్త అవార్డు- డ్రూ హిక్స్ ఫేవరేట్ ట్రావెల్ క్రియేటర్ అవార్డు- కమియా జానీ డిస్‌ప్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు-రణ్‌వీర్ అల్లాబాడియా(బీర్‌బైసెప్స్)
అవార్డు గ్రహీతల పేర్లు.. అవార్డు కేటగిరి
మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్-మేల్ అవార్డు- RJ రౌనాక్ (బావా) మోస్ట్ క్రియేటివ్ క్రియేటర్ (ఫిమేల్) అవార్డు- శ్రద్ధా జైన్ ఉత్తమ మైక్రో క్రియేటర్ అవార్డు- అరిడామన్ గేమింగ్ కేటగిరీలో బెస్ట్ క్రియేటర్ అవార్డు- నిశ్చయ్ బెస్ట్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ క్రియేటర్ అవార్డు- అంకిత్ బైయన్‌పురియా విద్యా కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త అవార్డు- నమన్ దేశ్‌ముఖ్ హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్ అవార్డు- జాన్వీ సింగ్ స్వచ్ఛ అంబాసిడర్ అవార్డు- మల్హర్ కలంబే బెస్ట్ క్రియేటర్ ఇన్ టెక్ కేటగిరీ అవార్డు- గౌరవ్ చౌదరి కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు- మైథిలీ ఠాకూర్ గ్రీన్ ఛాంపియన్ అవార్డు- పంక్తి పాండే ఉత్తమ కథకురాలి అవార్డు- కీర్తికా గోవిందసామికి
ఓటింగ్ రౌండ్‌లో 10 లక్షల ఓట్లు
సెలబ్రిటీ క్రియేటర్ అవార్డు- అమన్ గుప్తా 20 విభిన్న కేటగిరీల్లో 1.5 లక్షలకు పైగా నామినేషన్లు వచ్చిన తర్వాత ముగ్గురు అంతర్జాతీయ సృష్టికర్తలతో సహా విజేతలను నిర్ణయించారు. తదనంతరం, ఓటింగ్ రౌండ్‌లో, వివిధ అవార్డు విభాగాలలో డిజిటల్ సృష్టికర్తలకు సుమారు 10 లక్షల ఓట్లు పోలయ్యాయి.