LOADING...
PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు. రక్షా బంధన్‌ను పురస్కరించుకుని దేశంలోని రైతుల కోసం ఓ ప్రత్యేక బహుమతిని ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడతగా 9.7 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్లకుపైగా నిధులను నేరుగా బదిలీ చేయనున్నారు. ఈ నిధులలో పెద్ద భాగం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందనుంది. రాష్ట్రంలోని 2.3 కోట్ల మందికి పైగా రైతులకు రూ.4,600 కోట్లకు పైగా మంజూరవుతుంది. వారణాసిలోని రైతులకు మాత్రమే చూసుకుంటే, అక్కడి 2.21 లక్షల మంది అన్నదాతలకు రూ.48 కోట్లు అందించనున్నారు. ఈ పథకం ప్రకారం ప్రతి సంవత్సరానికి రైతుకు రూ.6 వేల రూపాయలు మూడు విడతలుగా అందజేస్తారు.

వివరాలు 

52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన

ఈ సందర్భంగా వారణాసిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. అలాగే రూ.2,183.45 కోట్ల విలువైన 52 అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ ఉదయం 10:30 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్బంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రధానికి స్వాగతం పలకనున్నారు.