Page Loader
ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ 
ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ

ప్లాట్లు కొనుగోలు చేసిన కేసులో మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు జారీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

బటిండాలో ఆస్తి కొనుగోలులో అవకతవకలకు సంబంధించి పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్‌పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో మంగళవారం లుకౌట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) నోటీసు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బాదల్ దేశం విడిచి పారిపోవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అందువల్ల అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. సోమవారం బటిండా ఆస్తి కేసులో బాదల్‌తో పాటు మరో ఐదుగురిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసిన మరుసటి రోజు తర్వాత ఈ చర్య తీసుకున్నారు.

Details 

ఈరోజు విచారణకు రానున్న బాదల్  ముందస్తు బెయిల్  పిటిషన్ 

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అనంతరం బాదల్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయన నివాసం,ఇతర ప్రదేశాలలో అధికారులు దాడులు నిర్వహించారు. అయితే ప్రస్తుతానికి అతని ఆచూకీ తెలియరాలేదు. అంతేకాకుండా, ముందస్తు బెయిల్ కోసం బాదల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా ఈరోజు విచారణకు రానుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో ఉన్న బాదల్‌తో పాటు, భటిండా డెవలప్‌మెంట్ అథారిటీ (బిడిఎ) మాజీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ బిక్రమ్‌జిత్ షెర్గిల్ పైన ఆదివారం రాత్రి కేసు పెట్టారు. ఈ కేసులో నమోదైన మిగతా నలుగురిని రాజీవ్ కుమార్, అమన్‌దీప్ సింగ్, వికాస్ అరోరా, పంకజ్‌లుగా గుర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మన్‌ప్రీత్ బాదల్‌పై లుక్‌అవుట్ నోటీసులు