NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pinnelli Ramakrishna Reddy: కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు.. రేపటితో కోర్టు గడువు సమాప్తం
    తదుపరి వార్తా కథనం
    Pinnelli Ramakrishna Reddy: కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు.. రేపటితో కోర్టు గడువు సమాప్తం
    కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు

    Pinnelli Ramakrishna Reddy: కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు.. రేపటితో కోర్టు గడువు సమాప్తం

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2024
    01:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తన పార్టీ అధికార పీఠానికి దూరమైంది . దీంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి బాధలు తప్పడం లేదు.

    కోర్టు గడువు ఎప్పుడు ముగుస్తుందా , అని పోలీసులు కాచుకు కూర్చొన్నారు. పరారు కాకుండా డేగ కళ్లతో నిఘా వేశారు.

    ఈవీఎం ధ్వంసం తర్వాత అరెస్టుకు సిద్ధమైన పోలీసులను ఆయన ముప్ప తిప్పలు పెట్టిన సంగతి విదితమే.

    కూటమి సర్కార్ కొత్తగా అధికారంలోకి వచ్చాక , కొలువు తీరకముందే జరగబోయే తొలి రాజకీయ అరెస్ట్ ఇదే కానుంది.

    Details 

    అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి

    ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల సమయంలో..ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.

    ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్టు పోలీసులు గుర్తించారు.

    ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అయితే, రేపటి వరకు అరెస్టు చేయొద్దని కోర్టు చెప్పిన నేపథ్యంలో, రేపు కోర్టు ఇచ్చిన గడువు ముగిసిన వెంటనే పిన్నెల్లిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

    మరోవైపు పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నాయి.

    పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోకుండా అతని చుట్టూ గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.

    Details 

    హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన  నంబూరు శేషగిరిరావు

    ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని ఎప్పుడు అరెస్టు చేస్తారో అనే సందిగ్ధత నెలకొంది పల్నాడు జిల్లాలో.. కాగా, కౌంటింగ్‌కు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.

    పిన్నెల్లి కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు నంబూరు శేషగిరిరావు.

    దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.

    Details 

    మాచర్లలో టీడీపీ విజయం

    ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌.

    మరోవైపు.. నిన్న వెలువడి ఫలితాల్లో పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ విజయం సాధించింది.

    వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఘన విజయాన్ని అందుకున్న విషయం విదితమే.

    అదుపులోకి తీసుకొని, అరెస్టు చూసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పిన్నెలి రామకృష్ణారెడ్డి

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    పిన్నెలి రామకృష్ణారెడ్డి

    Pinneli Rama Krishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్  భారతదేశం
    Pinnelli Ramakrishna Reddy : పిన్నెల్లికి సుప్రీంకోర్టు ఆంక్షలు.. కౌంటింగ్​ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశం సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025