LOADING...
Tamil Nadu Government Formation: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు కీలక మద్దతు
తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు కీలక మద్దతు

Tamil Nadu Government Formation: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు కీలక మద్దతు

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2026
04:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్న టీవీకే అధినేత విజయ్‌ చిన్న పార్టీలతో వరుసగా చర్చలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలతో పాటు వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. దీంతో విజయ్‌ శుక్రవారం మరోసారి గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు లోక్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసింది.

వివరాలు 

ఇప్పటికే మద్దతు ప్రకటించిన కాంగ్రెస్

విజయ్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, వీసీకే పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఈ సాయంత్రం అన్ని పార్టీలు కలిసి సంయుక్త ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించింది. వామపక్షాలు, కాంగ్రెస్‌, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118 స్థానాలకు చేరనున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. అయితే విజయ్‌ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో ప్రస్తుతం పార్టీ సంఖ్యాబలం 107కు తగ్గింది.

వివరాలు 

పార్టీల వారీగా సంఖ్యాబలం ఇలా..

టీవీకే : 107 కాంగ్రెస్‌ : 5 సీపీఐ : 2 సీపీఎం : 2 వీసీకే : 2

Advertisement