LOADING...
Kerala: కేరళలో దారుణ ఘటన.. గే డేటింగ్ యాప్‌లో పరిచయమైన బాలుడిపై 14 మంది అత్యాచారం.. 
కేరళలో దారుణ ఘటన..గే డేటింగ్ యాప్‌లో పరిచయమైన బాలుడిపై 14 మంది అత్యాచారం..

Kerala: కేరళలో దారుణ ఘటన.. గే డేటింగ్ యాప్‌లో పరిచయమైన బాలుడిపై 14 మంది అత్యాచారం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలో 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడులు జరిగిన ఘోర సంఘటన బయటకు వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు ఇప్పటి వరకు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు ఫుట్‌బాల్ కోచ్‌గా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులు గే డేటింగ్ యాప్ ద్వారా ఆ బాలుడిని పరిచయం చేసుకుని అతడిపై దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కాసర్ గోడ్ పోలీస్ చీఫ్ విజయ భరత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

వివరాలు 

2 ఏళ్లుగా జరుగుతున్న అఘాయిత్యం.. 

పోలీసుల ప్రకారం, ఈ అఘాయిత్యం రెండేళ్లుగా జరుగుతున్నట్లు నిరూపితమైంది. బాలుడు గే డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, అందులో నిందితులను పరిచయం చేసుకున్నాడు. కాసర్ గోడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకుళంలోని 14 మంది వ్యక్తులు రెండుళ్లుగా అతడిపై లైంగిక దాడి చేస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. బాలుడి ఇంట్లో,ఇతర జిల్లాల్లోని వివిధ ప్రదేశాల్లో కూడా ఈ అఘాయిత్యం జరిగినట్లు తెలుసుకున్నాం. ప్రత్యేకంగా, బాలుడి తల్లి తన ఇంట్లో నుంచి అనుమానాస్పదంగా ఒక వ్యక్తి పరిగెత్తుతూ వెళ్లడం గమనించగా, ఆ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. ఆమె తన కొడుకును ప్రశ్నించినపుడు అసలు విషయం బయటపడింది. వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ సంప్రదించి, పోలీసులకు పూర్తి సమాచారం అందజేశారు అని విజయ భరత్ రెడ్డి తెలిపారు.

వివరాలు 

 నిందితుడిగా రైల్వే ఉద్యోగి

బాలుడి వాంగ్మూలం ప్రకారం, పోలీసులు ఇప్పటివరకు మొత్తం 16 మందిపై పోక్సో (POCSO) కేసులు నమోదు చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడం కోసం డీఎస్పీ, నలుగురు ఇన్‌స్పెక్టర్లు నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అరెస్ట్ అయిన 14 మంది అనుమానితులు వయస్సు 25 నుంచి 51 సంవత్సరాల మధ్య ఉన్నారు. వీరిలో ఒకరు రైల్వే ఉద్యోగి కూడా నిందితుడిగా ఉన్నాడు.