Porsche crash: మొదటి పబ్‌లో ₹48,000 ఖర్చు చేసిన యువకుడు
మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత వారం పూనేలో పోర్ష్ కారును వేగంగా నడిపి ఇద్దరు మృతికి కారణమైన టీనేజ్ కుర్రాడికి 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోమన్నారు. ఇదిలా ఉంటే ఆ టీనేజ్ యువకుడు బాగా మద్యం సేవించి కారును వేగంగా నడిపాడు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. ఏకంగా రూ 48 వేలు బార్లో ఖర్చు చేశాడు. అతని బాధ్యతారాహిత్యంతో విలువైన ఇద్దరు టెక్కీలు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనే మన హైదరాబాద్ లో జరిగింది. ఓ పార్టీ మాజీ శాసనసభ్యుడి కుమారుడే కావడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ చేయబోము :ట్రాన్స్ పోర్ట్ కమిషనర్
అతగాడ్ని యాక్సిడెంట్ కేసునుంచి తప్పించే క్రమంలో మరిన్ని తప్పులు చేసి అడ్డంగా బుక్ అయ్యి తండ్రి ,కుమారుడు దొరికిపోయారు. ఈ మేరకు పూనే ట్రాన్స్ పోర్ట్ అధికారులకు ఆదేశాలు పంపామని తెలిపారు. పోర్ష్ కారుకు మరో ఏడాది కాలం పాటు రిజిస్ట్రేషన్ చేయబోమని వివరించారు. కారుకు సంబంధించి తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఫీజు చెల్సించలేదని వివేక్ చెప్పారు. బెంగళూరులో ఓ డీలర్ నుంచి పోర్ష్ కారు కొన్నారన్నారు. ప్రస్తుతం కర్నాటక టెంపరరీ రిజిస్ట్రేషన్ పై కారు వుందని తెలిపారు. ఇటువంటి దురదృష్టకరమైన ఘటనలు భవిష్యత్తులో జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
కారు కొనుగోలులో నిబంధనల ఉల్లంఘన : వివేక్ భిమన్వార్
అయితే ఇందుకు సంబంధించి మోటార్ ట్రాన్స్ పోర్ట్ నిబంధనలు ఏవీ పాటించలేదని కమిషనర్ వివేక్ భిమన్వార్ వివరించారు. నిబంధనలు సరిగా పాటించనందున మోటార్ ట్రాన్స్ పోర్ట్ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో ప్రమాదానికి కారణమైన టీనేజ్ యువకుడు బెయిల్ పై బయట వున్నాడు. కాగా అతని తండ్రిఅగర్వాల్ ని పరోక్ష బాధ్యుడ్ని చేస్తూ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.