కాంగ్రెస్ వ్యాఖ్యలపై దుమారం.. ప్రధానిని సభకు రప్పించింది మేం కాదు, అవిశ్వాస తీర్మాన శక్తి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గత కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి. కేంద్రంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గత 3 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. గురువారం చర్చలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సభకు వచ్చారు. మోదీ సభకు రావడం ఈ సెషన్లో ఇదే తొలిరోజుగా నిలిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టించాయి.మణిపూర్ అంశంపై మాట్లాడేందుకు సభకు హాజరుకావాలని మాత్రమే మోదీని కోరామన్నారు.అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తే ప్రధానిని పార్లమెంటుకు వచ్చేలా చేసిందన్నారు. దీనిపై క్షమాపణలు చెప్పాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. ఈ మేరకు రంజన్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నామని స్పీకర్ ప్రకటన చేశారు.