Page Loader
Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం
అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది. పహల్గాములో ఉగ్రదాడి కారణంగా భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో, భారత నౌకాదళం సన్నద్ధతను పరీక్షించుకునేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. సముద్రంలో ఎప్పుడు, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు భారత నేవీ సిద్ధంగా ఉందని వెల్లడించింది. మూడు రోజుల క్రితం భారత నావికాదళం సీ స్కిమ్మింగ్ టెస్ట్‌ను జరిపింది,

Details

విజయవంతమైన ప్రయోగం

ఇందులో మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఎఎం)ను ప్రయోగించింది. గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ మొదటిసారిగా గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నౌకాదళం విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్‌లు సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడం కోసం నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సూచిస్తాయి.