
PM Modi: నేటి నుంచి అమల్లోకి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన.. యువతకు రూ.15,000 ప్రోత్సాహకం
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయ ప్రజలకు ప్రసంగించారు. ఈసందర్భంగా యువత ఉపాధి, సాధికారతపై పలు కీలక ప్రకటనలు చేశారు. కోట్లాది మంది యువతకు పెద్ద బహుమతిగా 'ప్రధాన మంత్రి వికాస్ భారత్ రోజ్‌గార్ యోజన' అనే కొత్త ఉపాధి పథకాన్ని నేటి నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం కింద, అర్హులైన యువతకు రూ. 15,000ఆర్థిక సాయం అందించనున్నారు. ఈపథకం ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027మధ్య సృష్టించబడే కొత్త ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న ఈ యోజన కింద, కొత్తగా EPFOలో రిజిస్టర్ అయ్యే ఉద్యోగుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రూ. 15,000 జమ చేస్తుంది.
Details
పథకాన్ని రెండు విభాగాలుగా విభజించారు
పార్ట్-A : తొలిసారి శ్రామిక శక్తిలో చేరుతున్న ఉద్యోగులపై దృష్టి సారిస్తుంది. EPFOలో మొదటిసారి నమోదు చేసుకునే ఉద్యోగులకు రూ. 15,000 వరకు EPF జీత సహాయం అందుతుంది. ఈ ప్రయోజనం నెలకు రూ. 1 లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అన్ని చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జరగనున్నాయి. పార్ట్-B : యజమానులకు మద్దతు ఇవ్వడం లక్ష్యం. చెల్లింపులు నేరుగా యజమాని పాన్ నంబరుతో అనుసంధానించిన ఖాతాలో జమ అవుతాయి. ఈ విధంగా, కొత్త ఉద్యోగాల సృష్టి, యువతకు ఆర్థిక ప్రోత్సాహం, అలాగే యజమానులకు మద్దతు ఇవ్వడం ఈ పథక ప్రధాన లక్ష్యం.