తదుపరి వార్తా కథనం

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 13, 2023
05:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారిక నివాసంగా ప్రజా భవన్(Praja Bhavan)ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భట్టి విక్రమార్క డిసెంబర్ 14న ఉదయం 8.20 గంటలకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
గురువారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా భట్టి విక్రమార్క ప్రజా భవన్ లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిసింది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హయంలో బేగంపేటలో నిర్మించిన ప్రగతి భవన్ సీఎం అధికారిక నివాసంగా ఉండేది.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రగతి భవన్‌ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్
డిప్యూటీ సీఎం భట్టి అధికార నివాసంగా ప్రజాభవన్..#Telangana #Congress #prajabhavan #bhattivikramarka #NTVTelugu #NTVNews pic.twitter.com/jbjprw3qSI
— NTV Telugu (@NtvTeluguLive) December 13, 2023
మీరు పూర్తి చేశారు