Hyderabad: హైదరాబాద్ పరిధిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పునర్విభజన విధానాన్ని అనుసరించి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలను కూడా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్, పునర్విభజిత హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లు.. ఇవి గ్రేటర్ పరిధిలోని పోలీస్ కమిషనరేట్ల, జిల్లాల సరిహద్దులతో సరిగ్గా సరిపోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు పోలీసులు కమిషనరేట్లు,మూడు జిల్లాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నాలుగు కమిషనరేట్లుగా విభజించడంతో, వాటికి అనుగుణంగా జిల్లాల సరిహద్దులను కూడా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్,మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులను మార్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
వివరాలు
హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేక మార్పులు
అలాగే, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధికి సమానం ఒక కొత్త జిల్లా ఏర్పాటుచేయబడనుందని తెలిసింది. ఈ మార్పులపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కొద్ది రోజులలో విడుదల చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. వాటిలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలను మల్కాజిగిరి జిల్లాకు చేర్చనున్నారు. అలాగే, అమీర్‌పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని కూడా మల్కాజిగిరి జిల్లాలో భాగం చేయనున్నట్లు సమాచారం. ఇతర మండలాల్లో బండ్లగూడ్, బహదూర్‌పుర్ల ప్రాంతాలు ఇప్పటి విధంగా ఉండగా, కొత్తగా రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాలకు విస్తరిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధి ఉన్న ప్రాంతాలకే హైదరాబాద్ జిల్లా పరిధి వర్తించనుంది.
వివరాలు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంపై నిర్ణయం పెండింగ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉంది. పునర్విభజన తర్వాత మల్కాజిగిరి కమిషనరేట్ పరిధి ఎంతవరకు ఉంటుందో, ఆ ప్రకారం జిల్లా విస్తరిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాలు మల్కాజిగిరి జిల్లాలో విలీనం కానున్నాయి. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ (రంగారెడ్డి జిల్లా),కంటోన్మెంట్ (హైదరాబాద్ జిల్లా) శాసనసభ నియోజకవర్గాలు మేడ్చల్ జిల్లా పరిధిలోకి వస్తాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం జీహెచ్‌ఎంసీ పరిధిని దాటి ఉన్నందున, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
వివరాలు
రంగారెడ్డి జిల్లా విభజన
రంగారెడ్డి జిల్లా విస్తృత పరిధిలో ఉండడం, జిల్లా లోని ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు కారణంగా, దీనిని అర్బన్,రూరల్ జిల్లాలుగా విభజించే యోచన ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి → అర్బన్ జిల్లా ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధి → రూరల్ జిల్లా రూరల్ జిల్లాలో చేర్చబడిన మండలాలు: షాద్‌నగర్, శంషాబాద్, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం. సెన్సస్-2027 కింద, వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా హౌసింగ్ సెన్సస్ నిర్వహించనున్నారు. వచ్చే జనవరి మాసాంతం లోపే పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు.