NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని 
    తదుపరి వార్తా కథనం
    LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని 
    ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని

    LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని 

    వ్రాసిన వారు Stalin
    Mar 31, 2024
    02:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.

    రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి అవార్డు అందజేశారు.

    అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేకపోయారు.

    ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.

    నిన్న(శనివారం) రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భారతరత్న అవార్డు ప్రదానోత్సవంలో కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావులను భారతరత్నతో సత్కరించారు.

    Details 

    అద్వానీ జీవితం స్ఫూర్తిదాయకం: మోదీ  

    అయితే, ఇంతకు ముందు కూడా అద్వానీ తన కృషికి గానూ 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించారు.

    ఆ సమయంలో అద్వానీకి 90 ఏళ్లు,అనారోగ్యం కారణంగా అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి సన్మానించారు.

    96 ఏళ్ల లాల్ కృష్ణ అద్వానీ జీవితం స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. అట్టడుగు స్థాయిలో పని చేయడం నుండి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అయన జీవితం ఆదర్శమన్నారు.

    అద్వానీ హోం మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనదైన ముద్ర వేశారు.బీజేపీ పార్టీ స్థాపనలో అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు లాల్ కృష్ణ అద్వానీ కూడా కీలక పాత్ర పోషించారు.

    Details 

    2014లో గాంధీనగర్ నుంచి చివరిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ 

    అద్వానీ 1970లో దిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.

    1977 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత అద్వానీకి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించగా, 1999 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత హోం శాఖ బాధ్యతలు అప్పగించారు.

    2002 నుంచి 2005 వరకు ఉప ప్రధానిగా కూడా కొనసాగారు.

    అద్వానీ 1991, 1998, 1999, 2004, 2009లో గాంధీనగర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు.

    2014లో గాంధీనగర్ నుంచి చివరిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అద్వానీకి భారతరత్న అందిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    #WATCH | President Droupadi Murmu confers Bharat Ratna upon veteran BJP leader LK Advani at the latter's residence in Delhi.

    Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former Vice President M. Venkaiah Naidu are also present on this occasion. pic.twitter.com/eYSPoTNSPL

    — ANI (@ANI) March 31, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతరత్న

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    భారతరత్న

    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా లైఫ్-స్టైల్
    Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న' బిహార్
    Bharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?  తాజా వార్తలు
     LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న' నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025