'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం; దేశ రాజధానికి ఇక కొత్త చట్టం
దిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్రవేశారు. దీంతో బిల్లు దిల్లీ సర్వీసెస్ చట్టంగా మారింది. దేశ రాజధానిలో సేవల నియంత్రణపై వివాదాస్పద ఆర్డినెన్స్‌ను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు, 2023ని ఆగస్టు 1న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ బిల్లును ఆగస్టు 7న రాజ్యసభలో ఆమోదించారు. రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు పడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. దీన్ని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించింది.