Page Loader
Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు 
మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు

Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2025
07:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించింది.ఈ నేపథ్యంలో సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో జాతుల మధ్య జరిగిన ఘర్షణలకు ఆయన కారణమైనట్లు లీకైన ఆడియోలో పేర్కొనడంతో, గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, కొత్త సీఎం ఎంపిక అయ్యేంతవరకు బాధ్యతలు నిర్వర్తించాలని గవర్నర్ బీరెన్ సింగ్‌ను కోరారు. అయితే ఆయన రాజీనామా అనంతరం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఈ పరిస్థితి కొనసాగుతూ నాలుగు రోజులు పూర్తి కావడంతో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయం తీసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన