Paris Paralympics 2024: దేశానికి గర్వకారణం.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం మూడ్రోజుల పర్యటన సందర్భంగా బ్రూనై, సింగపూర్‌లో ఉన్నారు. మంగళవారం ఆయన బ్రూనైకి చేరుకున్నాడు. అక్కడ భారత హైకమిషన్ కార్యాలయాన్ని మోదీ ప్రారంభించాడు. అనంతరం ప్యారిస్ పారాలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన భారతీయ క్రీడాకారులకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. యోగేష్ కథునియా, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేష్ కుమార్‌లతో ప్రత్యేకంగా మోదీ మాట్లాడి అభినందించారు. తాను ఎక్కడ ఉన్నా, దేశపు క్రీడాకారుల గురించే ఆలోచిస్తానని తెలిపారు. యోగేష్ కథునియాతో మాట్లాడినప్పుడు అతని తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకూ 16 పతకాలు సాధించిన భారత్
ఇక పారాలింపిక్ క్రీడాకారుల విషయంలో ప్రధాని ప్రదర్శించిన ఈ ప్రత్యేక శ్రద్ధ, క్రీడాకారులలో మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ప్యారిస్ పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 16 పతకాలు సాధించింది. యోగేష్ కథునియా డిస్కస్ త్రోలో కాంస్యం, సుమిత్ ఆంటిల్ జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించి సత్తా చాటారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ దేశంలోని క్రీడాకారుల అభివృద్ధి పట్ల చూపుతున్న చిత్తశుద్ధి భారతదేశం మొత్తానికి గర్వకారణంగా మారింది.