Page Loader
కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక 
కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక

కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయ్; ఎస్‌సీఓ సదస్సులో పాక్‌కు మోదీ చురక 

వ్రాసిన వారు Stalin
Jul 04, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సభ్య దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని మోదీ నొక్కి చెప్పారు. ఎస్‌సీఓ వర్చువల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమక్షంలో ఆ దేశానికి చురకలంటించారు. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. రూపం ఏదైనా ఉగ్రవాదానికి సభ్య దేశాలు కలిసి పోరాడాలని స్పష్టం చేసారు. 2017లో ఎస్‌సీఓలో చేరిన తర్వాత సభ్య దేశాల శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది.

మోదీ

ఎస్‌సీఓలో కొత్తగా చేరిన ఇరాన్‌కు మోదీ అభినందనలు

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశంలో చైనాకు ప్రధాని మోదీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఎస్‌సీఓలో కొత్తగా చేరిన ఇరాన్‌ను మోదీ అభినందించారు. అలాగే త్వరలో చేరబోతున్న బెలారస్‌కు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన వారిలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని షెహబాజ్ షరీఫ్, సభ్య దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి ఇతర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్‌సీఓను సంస్కరించే, ఆధునీకరించే ప్రతిపాదనకు భారత్ మద్దతు ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.