PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్.. లెక్స్ ఫ్రిడ్‌మన్ పాడ్‌కాస్ట్ నేడే విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మరో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధకుడు, పాడ్‌కాస్ట్ హోస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మన్(Lex Fridman) ఈ ఇంటర్వ్యూను నిర్వహించారు.
ఈ విషయాన్ని మోదీ స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
లెక్స్ ఫ్రిడ్‌మన్ ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీతో త్వరలో పాడ్‌కాస్ట్ నిర్వహిస్తానని ప్రకటించగా, ఆ ప్రకారం ఈ ఇంటర్వ్యూను ఇటీవల నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూలో మోదీ తన చిన్ననాటి అనుభవాలు, హిమాలయాల్లో గడిపిన సమయం, ప్రజాజీవితంలో తన ప్రయాణం వంటి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నట్లు తెలిపారు.
ఫ్రిడ్‌మన్ కూడా ఈ ఇంటర్వ్యూను ఆదివారం విడుదల చేయనున్నట్లు వెల్లడించడంతో పాటు, ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన ఇంటర్వ్యూలలో ఒకటిగా పేర్కొన్నారు.
Details
అమెరికాలో ఏఐ పరిశోధకుడిగా పనిచేస్తున్న లెక్స్ ఫ్రిడ్‌మన్
రష్యా మూలాలున్న లెక్స్ ఫ్రిడ్‌మన్ ప్రస్తుతం అమెరికాలో AI పరిశోధకుడిగా పనిచేస్తున్నారు.
2018 నుంచి 'లెక్స్ ఫ్రిడ్‌మన్' పేరుతో పాడ్‌కాస్ట్‌లు నిర్వహిస్తూ, సైన్స్, టెక్నాలజీ, స్పోర్ట్స్, రాజకీయ రంగాల్లోని ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon Musk), అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్(Jeff Bezos), అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తదితరులను ఇంటర్వ్యూ చేసిన ఆయనకు యూట్యూబ్‌లో 4.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో కూడా మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే.
అందులో రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి అనేక కీలక అంశాలపై చర్చించారు.