
PM Modi: పహల్గాం దాడిపై ప్రధానమంత్రి మోదీ ఫైర్.. ఉగ్రవాదులకు ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకెక్కాయి.
పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)' ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి, 26 మంది పౌరులను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు.
ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందిస్తూ, వారి వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజాగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, మోదీ మరోసారి ఉగ్రవాదులకు ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.
అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్‌కాల్వ్స్ లౌరెంకోతో కలసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు.
Details
కఠిన చర్యలు తీసుకుంటాం
ఉగ్రవాదం అనేది మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదులు వారికి సహకరించే వారిపై భారత్ కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంపై బలమైన నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.
పహల్గామ్ ఘటన వెనుక పాక్ పాత్ర ఉన్నట్టు దేశ దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు పాక్‌కి చెందినవారని, వారిలో ఒకరు పాకిస్తాన్ ఆర్మీలో పారా కమాండోగా పని చేసినవాడని సమాచారం.
దీంతో ఈ దాడికి పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే తోయిబా మధ్య పక్కా తోడ్పాటుందన్న అభిప్రాయం ఏర్పడింది.
Details
ఎక్కడున్నా వదిలిపెట్టం
ఏప్రిల్ 22న ఈ దాడి జరిగిన తరువాత, వెంటనే భద్రతాపరమైన అంశాలపై ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.
తదుపరి రోజు బీహార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... ''ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వారిని ఎక్కడ ఉన్నా వెంబడించి శిక్షిస్తాం. వారి మద్దతుదారులకూ ఏ మాత్రం మినహాయింపు ఉండదు.
భూమి చివరదాకా వెంబడి శిక్షిస్తామని ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందించారు.