తదుపరి వార్తా కథనం
Narendra Modi: ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 15, 2025
07:33 am
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సందర్భానికి ముందే త్రివిధ దళాల ప్రతినిధుల నుండి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అలాగే రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ వేడుకను సజావుగా నిర్వహించడానికి ఎర్రకోట పరిసరాల్లో 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అదనంగా, 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉన్నారు. మహానగరం మొత్తం కెమెరాతో పటిష్టంగా కవర్ చేశారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను "నయా భారత్" ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.