LOADING...
PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

PM Modi: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఉపరాష్ట్రపతిని పరామర్శించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా 'ఎక్స్‌' వేదికగా వెల్లడించిన ఆయన, ధన్‌ఖడ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

Details

ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని

ప్రస్తుతం ఆయన్ను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (CCU)లో ఉంచి, కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ప్రధాని మోదీ ఆస్పత్రికి వెళ్లి ఉపరాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే, ఈ ఉదయాన్నే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఆస్పత్రిని సందర్శించి ధన్‌ఖడ్‌ ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.