ఐదు రాష్ట్రాలను కలిపే దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే; రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిని కలుపుతూ, ఐదు రాష్ట్రాల గుండా వెళ్లే ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్రం చేపడుతోంది. 1,386 కిలోమీటర్లు దూరంతో దాదాపు రూ.4లక్షల వ్యయంతో నిర్మిస్తున్న దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే మొదటి ఫేజ్‌ను ఆదివారం ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. సోహ్నా(హర్యానా)-దౌసా(రాజస్థాన్)ను కలిపే 229కిలోమీటర్ల రహదారిని మొదటి దశలో భాగంగా ప్రారంభించనున్నారు. ఉపాధిని సృష్టించడమే లక్ష్యంగా ఆర్థిక నగరాలను కలుపూతూ ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపడుతున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలను 9,000కిలోమీటర్ల మేర కలుపుతూ ఈ ఎక్స్‌ప్రెస్ వే కేంద్రం నిర్మిస్తోంది. సూరత్, ఇండోర్, భోపాల్, కోటా, జైపూర్, వడోదరకు కనెక్టివిటీని అందించే ఈ ఎక్స్‌ప్రెస్‌వేపై 40కంటే ఎక్కువ ప్రధాన ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నట్లు కేంద్రం చెబుతోంది.
రెండు గంటలలో దిల్లీ టు జైపూర్
దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది. దిల్లీ టు జైపూర్‌కు వెళ్లే సమయాన్ని ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఐదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గిస్తుంది. ప్రస్తుతం దిల్లీ నుంచి ముంబయికి 24గంటలు పడుతుండగా, ఇది పూర్తయింతే 12 గంటలు మాత్రమే పడుతుంది. 2023 డిసెంబర్ నాటికి ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోక రానుంది. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేలో హెలిప్యాడ్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్‌లు, అంకితమైన ఈవీ లేన్‌లు, ట్రామా కేర్ సెంటర్‌లు వంటి ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వన్యప్రాణుల క్రాసింగ్‌లు, జంతు ఓవర్‌పాస్‌లు ఉన్న ఆసియాలోనే తొలి హైవే ఇదని కేంద్రం పేర్కొంది.