LOADING...
PM Modi: పొంగల్‌ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ
పొంగల్‌ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ

PM Modi: పొంగల్‌ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 14, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల ప్రారంభంలో ప్రధాని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్ వంటను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గోవులకు కూడా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్ నాయుడు పాల్గొనగా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొంగలి వండిన ప్రధాని మోదీ 

Advertisement