Loading...
Mumbai: సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు.. వైరల్‌ అవుతున్న వీడియోలు
సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు..

Mumbai: సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు.. వైరల్‌ అవుతున్న వీడియోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు పదేళ్ల విరామం తర్వాత బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ముంబైలో వీరు సందడి చేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి నగర వీధుల్లో సందడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైలోని ప్రముఖ ప్రాంతమైన బల్లార్డ్ ఎస్టేట్‌లో ఈ ముగ్గురూ కలిసి కనిపించారు. భారత్‌లోని పురాతన ఫొటోగ్రఫీ స్టూడియోల్లో ఒకటైన హామిల్టన్ స్టూడియోస్ వెలుపల కొద్దిసేపు గడిపారు. అనంతరం స్థానిక స్ట్రీట్ ఫుడ్‌ను రుచి చూశారు. ప్రిన్స్ విలియం, కేట్ దంపతులకు ముంబై నగరంతో పాటు క్రికెట్‌తోనూ ప్రత్యేక అనుబంధం ఉంది.

వివరాలు 

యువక్రికెటర్లతో కలిసి గల్లీ క్రికెట్

2016 ఏప్రిల్‌లో తొలిసారి అధికారిక పర్యటన కోసం భారత్‌కు వచ్చిన సమయంలో స్థానిక చిన్నారులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు.

తాజాగా దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ముంబైకి వచ్చిన ప్రిన్స్ విలియం..ఓ పాఠశాలలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రికెట్ ఆడారు.

అనంతరం యువక్రికెటర్లతో కలిసి గల్లీ క్రికెట్‌లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు.

ఈ ఆటలో ప్రిన్స్ విలియంను ఔట్ చేసిన ఓ యువ క్రీడాకారిణిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

మరోవైపు సచిన్ టెండూల్కర్ యువ క్రీడాకారులకు క్రికెట్‌కు సంబంధించిన పలు సూచనలు చేశారు.

బ్రిటన్ యువరాజు దంపతులు సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలు,వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం..

ADVERTISEMENT