Page Loader
Priyanka Gandhi: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం (వీడియో)
వీడియో: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం

Priyanka Gandhi: ర్యాలీలో ప్రియాంక గాంధీకి పువ్వులు లేకుండా పుష్పగుచ్ఛం (వీడియో)

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2023
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి స్వాగతం పలికే సందర్భంలో పార్టీ నాయకుడు ఒకరు ఆమెకు ఖాళీ బొకే అందించారు. ఈఘటన ప్రియాంక సహా ఇతర కాంగ్రెస్ నేతలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత రాకేష్ త్రిపాఠి షేర్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా వేదికపైకి చేరుకున్న ప్రియాంక కి కాంగ్రెస్ నేతలు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సమయంలో,ఒక నాయకుడు ఆమెకు ఖాళీ పుష్పగుచ్ఛాన్ని అందించాడు. పుష్పగుచ్చంలో పువ్వులు లేకపోవడంతో ప్రియాంక స్వయంగా ఇందులో పువ్వులు ఎక్కడ అంటూ నవ్వులు పూయించారు. ఈ ఘటన వేదికపై ఉన్న ఇతర నేతలకు నవ్వు తెప్పించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రియాంక గాంధీకి ఖాళీ బొకే ఇచ్చిన వీడియో