
Priyanka Gandi: ఎంపీగా ప్రియాంక గాంధీ.. తొలిసారి వయనాడ్ పర్యటన
ఈ వార్తాకథనం ఏంటి
తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మూడవ వ్యక్తిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ చరిత్ర సృష్టించారు.
తాజాగా కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్‌లోకి ప్రవేశించారు.
సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి శనివారం వయనాడ్ చేరుకున్న ప్రియాంకకు ఘన స్వాగతం లభించింది.
నియోజకవర్గ ప్రజలతో ఆమె నేరుగా మమేకం అయ్యారు.
Details
రాహుల్ గాంధీ రికార్డును అధిగమించిన ప్రియాంక గాంధీ
ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు.
4.8 లక్షల ఓట్లతో విజయం సాధించి, రాహుల్ గాంధీ రికార్డును అధిగమించారు.
గతంలో రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. గురువారం పార్లమెంట్‌లో ఎంపీగా ప్రియాంక గాందీ ప్రమాణ స్వీకారం చేశారు.
కేరళ సంప్రదాయ కసావు చీరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రమాణ స్వీకారానికి ముందు భారత రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తన రాజకీయ దృఢతను చాటిచెప్పారు.
Details
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఇప్పటివరకు ప్రచారానికి మాత్రమే పరిమితమైన ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ పార్టీలో కొత్త శకానికి నాంది పలికింది.
తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, గాంధీ కుటుంబం ప్రాధాన్యతను కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత బలపర్చారు.
వయనాడ్ ప్రజల కోసం ప్రియాంక గాంధీ చేపట్టే రాజకీయ పయనం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.
Embed
వయనాడ్ లో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ
#WATCH | Kerala: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi and Wayanad MP Priyanka Gandhi Vadra arrive at Calicut International Airport, Karipur; receive a warm welcome from party leaders and workers They will jointly address a public rally in Kerala's Wayanad today (Source:... pic.twitter.com/nwVYEqP5xi— ANI (@ANI) November 30, 2024